Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
అంతరించి పోతున్న జానపద కళలకు ప్రాణం పోయాలని పీఎన్ఎం జిల్లా అధ్యక్షులు నాపల్లి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. ఆదివారం మండలంలోని పర్వేదుల గ్రామంలో ప్రజనాట్య కళా మండలి కళాకారులు ప్రదర్శించిన ఆట,పాట కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ సంప్రదాయాల కలబోతతో వైవిధ్యాన్ని కలిగి ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు వినోదాన్ని కలిగిస్తూ ఉండేవి కానీ క్రమేపి కళారూపాలు అంతరించి పోతూ అవసానదశకు చేరుకుంటుంన్నాయని తెలిపారు. తెలంగాణ, ప్రాంతాల్లో వివిధ రూపాల్లో జానపద కళారూపాలు జనానికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ కళలను వ్యక్త పరిచే కళాకారులకు జీవన మార్గాన్ని సూచిస్తూ, సాంస్కృతిక వికాసాన్ని పంచేవని అన్నారు. గ్రామాల్లోకి సైతం టెలివిజన్ ప్రసారాలు రావడంతో జానపద రూపాలను తిలకించే వారి సంఖ్య కుంచించుకుపోయిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనికి, పాటకు అవినాభావ సంబంధమున్నదని గుర్తు చేశారు. పల్లెల్లో వీధి భాగవతములు, బుర్ర కథలు, నాటకాలు, డ్యాన్సులు, చిందు యక్షగానాలు శ్రమ జీవుల అలసటను దూరం చేసి ప్రశాంతతను చేకూర్చేవి. ఇలా సహజ సిద్ధముగా ఉండే కళా రూపాలకు ఆధునిక వసతులు తోడవడంతో టెలివిజన్ రాకతో మూడు సినిమాలు, ఆరు సీరియల్స్‌గా మారి కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలరోజులుగా డప్పు వాయిద్య కళలను ప్రదర్శించడం సంతోషం అని తెలిపారు. సర్పంచ్ దండ మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దుబ్బ రామచంద్రయ్య, కో ఆఫషన్ సభ్యులు బషీర్, ఉపసర్పంచ్ బుజ్జి బాబు, ఎంపీటీసీ శ్రీరాములు, పీఎన్ఎం సభ్యులు సైదులు, ఆదిత్య, రాములు,యాద గిరి, అంజమ్మ, రాజు, ప్రసాద్ పాల్గొన్నారు.