Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిక్సూచిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నిలిచారని బీర్ల ఫౌండేషన్ చైర్మెన్్ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రామనాథపురం రోడ్ చౌరస్తా వద్ద దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటుకు దొడ్డి కొమరయ్య కమిటీ అధ్యక్షులు ఎగ్గిడి శ్రీశైలం ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య పోరాటపటిమ ఎనలేదని ప్రశంసించారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, కురుమ సంఘం జిల్లా నాయకులు కాదూరి అచ్చయ్య సంఘం అధ్యక్షులు ఎగ్గిడి లక్ష్మణ్, కౌన్సిలర్ జూకంటి శ్రీకాంత్, కమిటీ సభ్యులు జల్లి నర్సింహులు, బందెల సుభాష్ ,పత్తి వెంకటేష్, జూకంటి ఉప్పలయ్య, జూకంటి సంపత్ ,మల్లెల శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.