Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్:జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం షీ టీంలు కషిచేస్తున్నాయని, షీ టీం జిల్లా ఇన్చార్జి కె.అనిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జేఎంజే ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, విద్యార్థులు, పసిపిల్లలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలకుపాల్పడుతున్నారన్నారు. వాటిని అరికట్టేందకు పోలీస్ శాఖ ప్రత్యేక దష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు . ఎవరైనా మహిళలకు వేధింపులకు గురిచేస్తే వెంటనే షీటీం, వాట్స్ యాప్ నంబర్ కు 9490617111 లేదా 100 డయల్ చేసి సమాచారమివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు పార్వతి,చక్రు, పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జయా భార్గవి,ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.