Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యాగ వైభవం లేకుండానే ప్రారంభమా..!
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రిపై భారీ ఎత్తున యాగం జరగాలంటే ఆరు నెలల ముందే ఏర్పాట్లు మొదలవ్వాలి. ఆలయ ప్రారంభం మార్చి 28న అని గతేడాది అక్టోబర్ 19న సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుండి ఏర్పాట్లల్లో నిమగమైనా బాగుండు. కానీ..ఇక్కడ ఆ సన్నాహాలు ఏమి లేకపోగా...కనీసం ఆహ్వాన పత్రికలు కూడా ముద్రణ జరగలేదంటే ఈ క్రతువుపై అప్పుడే భక్తజనం అనుమానాలు కలిగాయి. కాగా సీఎం 18వ పర్యటనలో (ఈ నెల 12న) భాగంగా ప్రెసిడెన్సియల్ సూట్ ప్రారంభించి కొండపైకి వెళ్లలేదనే అపవాదు ఉంది. అంతకు ముందు 7న జరిగిన పర్యటనలో కొండపైకి వెళ్లినా..ప్రధానాలయంలో బంగారు తాపడం పనులు పరిశీలనే జరపలేదు. ఇవన్ని యాగం రద్దుకు సంకేతాలు కావొచ్చని భక్తులు భావిస్తున్నారు.