Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పి.సంధ్యారెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
కార్యకర్తలు కలిసికట్టుగా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పి. సంధ్యా రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన బూత్ కమిటీ సభ్యులు శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టే విధంగా ప్రతి కార్యకర్త కషి చేయాలని కోరారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు కరెంటు శ్రీను నాయక్, నాయకులు కరెంటు బిక్షపతి నాయక్, ఏపూరి సతీష్ ,మందుగల బాలకష్ణ,రాచకొండ రమేష్, చిలువేరు కష్ణ, కరెంటుతో ప్రజ్ఞ నాయక్, నరి జగదీష్, ఎస్.కె షబ్బీర్, చిలువేరు శంకర్, గుత్త శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.