Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై జిల్లా 65 ఫిర్యాదులను ప్రజల నుండి స్వీకరించారు. ఫిర్యాదులను ఎలాంటి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులలో భువనగిరి ఆర్డీఓకు 4, చౌటుప్పల్ ఆర్డీవో 5, వివిధ తహసీల్దార్లకు సంబంధించి 35, జిల్లా పంచాయతీ అధికారి 4, మున్సిపాలిటీలకు సంబంధించి 4, సహకార శాఖ 2, విద్యా శాఖ 3, వైద్య, పరిశ్రమలు, సంక్షేమ శాఖ, జిల్లా పరిషత్, పోలీస్, ఎక్సైజ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 65 ఫిర్యాదులు ప్రజల నుండి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం.నాగేశ్వరా చారి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మైనార్టీ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ
మైనార్టీ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్ ను సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎండి.ఇద్రిస్, టీజీఓ జిల్లా అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు జగన్ , జమాల్, అమీన్, ఉద్దీన్, సయ్యద్, సజ్జద్, ముబాషీర్, సోహెల్, కయ్యం పాల్గొన్నారు.