Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫామ్ ల్యాండ్ రోడ్లను పూడ్చిన రియల్టర్లపై పోలీసులకు ఫిర్యాదు
అ జిల్లా కలెక్టర్ సిఫార్సు చేసిన కేసు నమోదులో జాప్యం చేసిన పోలీసులు
అ ఎట్టకేలకు కేసు నమోదు..?
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలంలోని ఎనగంటితండా, పిపల్ పహాడ్,దేవలమ్మ నాగరం గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ భూములను ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ చేసి విక్రయిస్తున్న వైష్ణవి డేవేలేపర్స్, బందావన్ డేవేలేపర్స్ వెంచర్లను ఈ నెల 19న పంచాయతీ రాజ్ అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు డిస్మెంటల్ చేసిన విషయం విదితమే.ప్రభుత్వ అధికారులు వెంచర్ లోని కడిలను నేలమట్టం చేసి,రోడ్లకు కందకాలు కొట్టారు.వైష్ణవి డేవలపర్స్ నిర్మించిన రేకుల షెడ్ ను సైతం కూల్చేశారు. ఇలా వెంచర్లను కూల్చేసి వెళ్లిన సాయంత్రమే ఫామ్ ల్యాండ్లు చేసిన వైష్ణవి డేవేలేపర్స్ వారు అధికారులు తీసిన గుంతలు పూడ్చేశారు.ఈ విషయంపై ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శిలు సోమవారం ఉదయం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫామ్ ల్యాండ్ వెంచర్ ల యజమానులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఎస్సై సైదులుకు ఫిర్యాదు చేయగా,బాధ్యతరహిత సమాధానము చెప్తూ కేసు నమోదు చేయకుండా జాప్యం చేసినట్లు పంచాయతీ కార్యదర్శిలు వాపోతున్నారు.పోలీసుల తీరుపై పంచాయతీ కార్యదర్శిలు పై అధికారులకు సమాచారం అందించగా జిల్లా కలెక్టర్ స్పందించి డిపిఓ కు ,డిపిఓ స్థానిక ఆర్డీవో కు,ఆర్డీవో పోలీస్ సీఐ కి ఫోన్ చేసిన చెప్పిన కూడా ఫిర్యాదు స్వీకరించకుండా, కేసు నమోదు చేయకుండా,పడిగాపులు గాయించారు. రాత్రి7 గంటలకు ఎంపిఓ అంజిరెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు అందించగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేస్తామని చెపినట్లు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించారు తప్ప కేసు నమోదు చేయలేదని పంచాయతీ కార్యదర్శిలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ సిఫార్సు మేరకు డిపిఓ చెప్పిన కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా రియల్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులనే పడిగాపులు గాయించిన పోలీసులు ఇక సామాన్య ప్రజలకు ఎలా స్పందిస్తారని పలువురు వాపోతున్నారు.
ఫామ్ ల్యాండ్ వెంచర్ యజమానులపై కేసు నమోదు చేస్తాం-సీిఐ శ్రీనివాస్
పంచాయతీ కార్యదర్శిలు అందించిన ఫిర్యాదు మేరకు వెంచర్ యజమానులు అయిన వైష్ణవి డేవేలేపర్స్ పై రెండు కేసులు,బందావన్ డేవేలేపర్స్ వారిపై ఒక కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.