Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ఎండి. జహంగీర్
నవతెలంగాణ -వలిగొండ
2 సంవత్సరాల క్రితం మంజూరు అయ్యి నిలిపివేసిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం మండల కమిటీ సమావేశం గాజుల ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒకపక్క ధనిక రాష్ట్రం అని చెబుతూనే మరోపక్క మంజూరు నిలిపివేసిన వితంతు, వికలాంగ, వృద్ధాప్య, చేనేత ,గీత కార్మికుల పింఛన్లు నిలిపివేసిందన్నారు. దీంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు ముందస్తుగా నోటీసు ఇవ్వాలని, వారు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన డబుల్ బెడ్రూం ,దళితులకు 3 ఎకరాల భూమి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సిరిపంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు రామ్ చందర,్ శ్రీనివాస్, మెరుగు వెంకటేశం ,గణపతి రెడ్డి, కొండే కిష్టయ్య ,మొగిలి పాక గోపాల్ ,దుబ్బ లింగం, భీమన బోయిన జంగయ్య ,తదితరులు పాల్గొన్నారు.