Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని అమ్మానాన్నా అనాధాశ్రమానికి నూతన భవన నిర్మాణ పనులకు సోమవారం మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధల కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్‌బాబు, కొయ్యడ సైదులుగౌడ్, బండమీది మల్లేశం, ఎమ్‌డి.బాబాషరీఫ్ పాల్గొన్నారు.