Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
దివిస్ పరిశ్రమ యాజమాన్యం ఆధ్వర్యంలో మండలంలోని పిపల్ పహాడ్, ఎనగంటితండా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని 310 మంది విద్యార్థులకు సోమవారం ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ దివిస్ సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చిరిక రాణి రంగారెడ్డి,నర్సింహ్మ నాయక్,ప్రధానోపాధ్యాయులు యాదగిరమ్మ, కమలాకర్ రెడ్డి,డాక్టర్ అశ్విన్ కుమార్,ఎస్ఎంసి చైర్మన్ బి.ప్రేమలత,దివిస్ ప్రతినిధులు వల్లూరి వెంకటారాజు, సాయికష్ణ,జి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.