Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పట్టణ ప్రగతిలో గోల్మాల్
అ పట్టించుకునే నాథుడే లేడు
అ విలేకర్ల సమావేశంలో కౌన్సిలర్లు
నవతెలంగాణ-కోదాడరూరల్
కోదాడ మున్సిపాలిటీ అవినీతిమయంగా మారిందని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నయానగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లా డారు.మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త కోసం నాసిరకం డబ్బాలు కొన్నారని, ఎన్ని డబ్బాలు వస్తున్నాయని అడిగితే సమాచారం ఇవ్వడం లేదన్నారు.పట్టణంలో డ్రయినేజీ, సీసీరోడ్ల నిర్మాణాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు.నాసిరకం నిర్మాణాలు చేపడుతున్నారన్నారు.35 వార్డుల్లో నలుగురే కాంట్రాక్టర్లు పనిచేయడం ఏంటని ప్రశ్నించారు.మున్సిపల్ చైర్పర్సన్ పేరుకే ఉన్నారని, పనుల్లో నాణ్యత గురించి ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.ఇంటిలో పెద్దదిక్కు కోల్పోతే ఎలా ఉంటుందో అలా కోదాడ మున్సిపాలిటీ అలా తయారయిందని ఎద్దేవా చేశారు.పట్టణ ప్రగతి గోల్మాల్ అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.డ్రయినేజీ కట్టేటప్పుడు ఇంజనీర్లు వాటర్ లెవెల్ వేయాలని, వాటర్ లెవెల్ వేయడం రాని ఇంజనీర్లు మున్సిపాలిటీలో ఉన్నారని విమర్శించారు.పట్టణంలో డ్రయినేజీలను సరిగా నిర్మించక పోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు నీరునిల్వ ఉందన్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లకు తెలియకుండానే ప్రభుత్వ దుకాణాలపై నూతన కార్యాలయాలు కట్టడం ఏంటని ప్రశ్నించారు.అసలు ఇంతవరకు జనరల్ బాడీ సమావేశం జరగక ఎనిమిది నెలలు గడుస్తున్నా ఏ విధంగా దుకాణాలపై నూతన కార్యాలయం నిర్మిస్తారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ స్థలాలలో కాంట్రాక్టర్లు డబ్బా కోట్లు ఏర్పాటు చేసి నెలానెలా కిరాయిలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.వార్డులలో వీధిలైట్లు పోతే పెట్టలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.రెండేండ్లలో రెండు సార్లు జనరల్ బాడీ సమావేశం నిర్వహిం చారన్నారు. మొక్కలకు రూ.2 కోట్లు ఖర్చు పెట్టారు కానీ వార్డులలో ఒక్క మొక్క సరిగా బతకలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జనరల్ బాడీ సమావేశం నిర్వహించిన సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బత్తినేని హనుమంతరావు, , సామినేని నరేష్, షాబుద్దీన్, గంధం యాదగిరి, కందుల కోటేశ్వరరావు, కర్రి సుబ్బారావు, కొల్లా కోటిరెడ్డి, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.