Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్
నవతెలంగాణ-పెద్దవూర
విద్యారంగ సమస్యల సాధన కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ని న్యూవిజన్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల మహాసభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్యను మర్చిపోయిందని, విద్యా వ్యాపారంగా అందని ద్రాక్షల నేటి విద్యా వ్యవస్థ తయారైందన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం మెనూ, బడ్జెట్ ప్రకటించకపోవడం వల్ల అరకొర వసతుల మధ్య విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యా ర్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో విద్యారంగ సమస్యలపై మరో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అనేక ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోరే రమేష్, నూతన మండల అధ్యక్ష, కార్యదర్శులు గణేష్, అజరు, నజీర్, అంజలి, ప్రకాష్, చందు, సాయి మల్లీశ్వరి, విజరు, వంశీ, అజరు చంటి, సుధీర్ పాల్గొన్నారు.