Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంఘీభావం ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
14 ఏండ్లుగా ఉపాధి హామీచట్టంలో పనిచేస్తున్న తమను సీఎం కేసీఆర్ తొలగించడం తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసన దీక్షను చేపట్టారు.వీరికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పూలమాలలేసి వేసి దీక్షను ప్రారంభించారు.ఈ సందర్భంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లిరాములు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు మాట్లాడారు.గ్రామస్థాయిలో నిత్యం కూలీలకు అందుబాటులో ఉంటూ కేవలం ఉపాధి హామీ పనులే కాకుండా ప్రభుత్వం చేపట్టిన హరితహారం, మరుగుదొడ్లు నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, డంపింగ్‌యార్డ్ నిర్మాణం, పల్లెప్రకతివనం వంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పనిచేస్తున్న వీరిని ప్రభుత్వం తొలగించడం అన్యాయమన్నారు. గ్రామస్థాయిలో కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించాలన్న, వేతనాలు సక్రమంగా రావాలన్న ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం ఒక్క కలం పోటుతో 4779 సర్క్యులర్‌ను తెచ్చి వారిని బజారుకు ఈడ్చిందని విమర్శించారు.దీంతో 64 మంది చనిపోయారన్నారు.దీక్షకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయనాయుడు, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యాదగిరి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మూరగుండ్ల లక్ష్మయ్య,మహిళా సమైక్య జిల్లా నాయకురాలు అనంతుల మల్లేశ్వరి సంఘీభావం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు వాంకుడోత్ లింగానాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా నాయకులు మేడి యాదయ్య,ఆర్.లింగయ్య, బాలసైదులు, కష్ణవేణి, కల్యాణి,లింగయ్య, రాము, జ్యోతి, గూగులబాబు, నక్క శైలజ, సుమలత, పుష్పలత, ధీరావత్ శ్రీనివాస్, ఎం.వీరస్వామి, కె.వీరయ్య, నర్సయ్య, శంకర్ పాల్గొన్నారు.