Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సూర్యాపేట కలెక్టర్ వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
దళితబంధు డబ్బులతో అభివద్ధి చెందాలని కలెక్టర్ వినరుకష్ణారెడ్డి అన్నారు.సోమవారం మండలపరిధిలోని తుల్జారావుపేట గ్రామంలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో ఎంపిక చేసుకున్న యూనిట్తఓ స్వయంఉపాధి పొందే నిమిత్తం యూనిట్ విజయవంతం అవుతుందా? లేదా? అని పరిశీలించారు.లబ్దిదారుల దరఖా స్తులను పరిశీలిస్తూ ఇంటర్వ్యూ నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు కింద రూ.10 లక్షలు మంజూరైన లబ్దిదారులు ఒక్క రూపాయి కూడా వధా చేయకుండా సద్వినియోగం చేసుకోవా లన్నారు.యూనిట్‌ను ఎంపిక చేసుకున్న లబ్ది దారులకు ఆయా పనిలో వారికి గల అనుభవాన్ని, ఆసక్తిని, అవి విజయవంతంగా నడుస్తాయా? అని సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసు కున్నారు.ఊరికే కారు కొని పెట్టుకుంటే అది సక్రమంగా నడవకపోతే డబ్బు వధా అవుతుందని తెలిపారు. నోముల ప్రసాద్ అనే లబ్దిదారుడు తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నందున టాక్సీ కార్ పెట్టుకున్నానగా అది నెల వారీగా ఎవరికీ పెడతావు? అలా ప్రతినెలా ఎంత మొత్తం గ్యారెంటీగా వస్తుంది? అని తెలుసుకొని ప్రసాద్‌కు కారు వస్తే నెల వారీగా అద్దెకు పెట్టుకుంటామని తెలిపిన వారికి కూడా కలెక్టర్ నేరుగా ఫోన్ చేసి ధ్రువీకరించుకున్నారు.అదేవిధంగా ట్రాలీ బొలెరో పెట్టుకున్న వారు నిత్యం దానితో నిమ్మకాయలు సప్లై చేస్తామనగా నిమ్మకాయల వ్యాపారితో కూడా కలెక్టర్ నేరుగా చరవాణిలో మాట్లాడి ధృవీకరించు కున్నారుప్రతియూనిట్ గురించి కసరత్తు చేశారు.లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో త్వరలో రూ.10 లక్షలు వేస్తామని, వాటితో అవసరమైన యూనిట్లు పెట్టాలని, అవసరమైతే తప్ప మొత్తం డబ్బు ఒకేసారి ఖర్చు చేయొద్దన్నారు.మేకలు,గొర్రెల, డెయిరీ యూనిట్లు పెట్టుకున్న లబ్దిదారులకు వెటర్నరీ వైద్యులు సలహాలు ఇవ్వాలన్నారు.ఏప్రిల్ 1 నుండి నియోజకవర్గంలో రెండు వేలమంది దళిత బంధు లబ్దిదారులను ఈ గ్రామానికే తీసుకొచ్చి పథకం సక్రమంగా అమలయ్యేందుకు విజయవంతంగా నడుస్తున్న యూనిట్లను చూపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, దొంగరి కోటేశ్వర్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, ఎంపీడీఓ లక్ష్మీ, ఎంపీవో గోపి, వ్యవసాయాధికారి ఆశాకుమారి, పశువైద్యాధికారి సంతోష్, ఆర్ఐ రామారావు, బాలాజీ, పవన్, కార్యదర్శి అశోక్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.