Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు మల్లులక్ష్మీ
నవతెలంగాణ-మునగాల
రెడ్‌బుక్ డేను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లులక్ష్మీ పిలుపునిచ్చారు.రెడ్ బుక్ డే సందర్భంగా సోమవారం మండలంలోని కలకోవ గ్రామంలో పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న రాజకీయ పరిస్థితులను దష్టిలో ఉంచుకొని మార్క్సిజం అధ్యయనం కొనసాగించాలని కోరారు.దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రజల్లో ఉన్న అసంతప్తిని దారి మళ్ళించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత ఘర్షణలకు పాల్పడుతుందుని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించగల సిద్దాంతమే మార్క్సిజంలో ఉందన్నారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు,మండల కమిటీ సభ్యులు మండవ వెంకటాద్రి, కుంభదడ వెంకటకోటమ్మ, శాఖ కార్యదర్శులు కొంపెల్లి లింగయ్య, పాతకోట్ల లింగయ్య, అనంతుల కోటిలింగం,మండవ వెంకన్న, గ్రామ శాఖ సభ్యులు పాల్గొన్నారు.