Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మాతభాషను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు.సోమవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తన తండ్రి గుడిపాటి ఫకీర్ జ్ఞాపకార్థం విద్యార్థులకు రూ.5 వేల విలువ గల జనరల్నాలెడ్జి పుస్తకాలు అందజేసి మాట్లాడారు.ప్రతిబిడ్డా అమ్మను కాపాడుకునట్టే మాతభాషను కూడా కాపాడుకోవాలన్నారు.మనుగడ కోసం ఇతరభాషలను నేర్చుకోవడంలో తప్పులేదు కానీ, వాటి ప్రభావం మాతభాషపై పడకుండా పరిరక్షించు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోయిని లింగయ్య, ప్రధానో పాధ్యాయులు కొండగడుపులయాకయ్య, పాఠశాల ఉపాధ్యాయ బందం భాస్కర్, సహదేవ్, హరికిషన్, రవికుమార్, రాజన్న, హరిత, హరీష్, రాజు, నవీన్, ప్రసాద్, శ్రీనివాస్, రమాదేవి, లావణ్య పాల్గొన్నారు.