Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
పట్టణంలోని పురపాలక సంఘం నందు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా అధ్యక్షతన 2022-23 బడ్జెట్ సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ పాల్గొని మాట్లాడారు. 2019 యాక్ట్, 107, 108 సెక్షన్ ప్రకారం బడ్జెట్లో పొందుపర్చిన నార్మ్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలని సూచించారు. దానిలో మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం (జనరల్ ఫండ్, పట్టణ ప్రగతి గ్రాంట్, 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు ఇతర ప్రభుత్వ నిధులు)లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని సూచించారు. ఛార్జ్డ్ అకౌంట్స్ నుండి జీతాలు, సీసీ చార్జెస్, శానిటేషన్ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాలని సూచించారు. జీవో ఎంఎస్ నెం.58, 59 ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్నవారు ఇండ్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మీ సేవా కేంద్రాల్లో ధరకాస్తు చేసుకోవాలని తెలిపారు. బడ్జెట్ సమావేశాన్ని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో కమిషనర్ వెంకటయ్య, వైస్ చైర్మన్ ఎండీ.రహత్ అలీ పాల్గొన్నారు.