Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ :పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 11 గంటలవుతున్నా వాక్సిన్ లేక విద్యార్థులు వేచిచూశారు. అక్కడ ఉన్న ఏఎన్ఎంవివరణ కోరగా పీ హెచ్ సీ సెంటర్ ఖాజీపేట నుండి వ్యాక్సిన్ రావాల్సి ఉందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో ని పెద్దాసుపత్రిలో వ్యాక్సిన్ కొరత ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వాక్సిన్ కొరత ఉండడం బాధాకరమన్నారు. ఆలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.