Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్
బంజారాల ఆరాధ్య ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో గిరిజనులు నడవాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీలో మంగళవారం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఎంపీపీ భగవాన్‌నాయక్, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. అంతకుముందు సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేసి బోగ్ భండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ రవి నాయక్, ఎంపీపీ అనురాధ సుందర్ రెడ్డి, జెడ్పీటీసీ సూర్య భాష్య నాయక్, ఆర్టీఓ రాంకుమార్ నాయక్, యువ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ పాల్గొన్నారు.