Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి మంగళవారం పట్టణంలో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించారు. ఇరిగేషన్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి ఐటీ హబ్ పక్కన ఉన్న ఎలిమినేటి మాధవ రెడ్డి కెనాల్‌ను పరిశీలించారు. ఇక్కడి కాల్వ వెంబడి రోడ్డు నాలుగు ప్రధాన రోడ్లకు అనుసంధానం ఉన్నందున, దీనిని ఉదయ సముద్రం వరకు అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఉదయ సముద్రం చేరుకుని బండ్ పటిష్టత, సుందరీకరణపై చర్చించి సూచనలు చేశారు. శిల్పారామం, నీలగిరి కళాభారతి నమూనాలపై చర్చించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు తనిఖీ చేసి సూచనలు చేశారు. వీరి వెంట అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి, ప్రజారోగ్య టీయూ ఎఫ్ఐ. డీసీఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణా చారి, ప్రజారోగ్య శాఖ ఈఈ సత్యనారాయణ, ఇరిగేషన్ అధికారి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.