Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
చౌటుప్పల్ మండలం దామెరా గ్రామాన్ని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలోని నర్సరీ, డంపింగ్ యార్డులను సందర్శించారు. హరితహారంలో రోడ్ల ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్యంపై సర్పంచ్ నారెడ్డి అండాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు నారెడ్డి అభినవ్ రెడ్డి కలెక్టర్ దష్టికి తీసుకెళ్లారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎండీిఓ రాకేష్ రావు, ఏపీఓ ఈశ్వరయ్య, సర్పంచ్ నారెడ్డి అండాలు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం:మండలంలోని గుడిమల్కాపురం గ్రామాన్ని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పపతి సందర్శించారు. అనంతరం చిమిర్యాల, మహమ్మదాబాద్ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రకతి వనాలను, నర్సరీలను పరిశీలించారు. కలెక్టర్ వెంట సర్పంచులు, అధికారులు ,ఎంపీటీసీలు ఉన్నారు.