Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రజక వత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
రజకులకు రక్షణ చట్టం అమలు చేసి ప్రతి రజక కుటుంబానికి రూ. 10 లక్షల రుణం మంజురు చేయాలని రజక వత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం రాష్ట కమిటీసమావేశం గుట్టలో నిర్వహించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా రజక వత్తిదారులు ఉన్నారని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, తీవ్ర వెనుకబాటు తనం ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకపోవడంతో, గత బడ్జెట్లో, 2021లో కేటాయింపులు లేనందున రుణాలు రాలేదన్నారు. అనేకచోట్ల రజక మహిళలపై, లైంగిక వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వీటిని అరికట్టడానికి, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, తరహాలో ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రజక వత్తి దారులు చెరువులు, నదుల వద్ద, బట్టలు ఉతుకుతు,ప్రమాదాలకు గురవుతూ మరణిస్తున్నారన్నారు. వారికి, రూ, 5 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ,అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఆధునిక దోబీ ఘాట్లు నిర్మించాలని కోరారు. రజకుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఐక్య ఉద్యమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర అద్యక్షుడు గుమ్మడి రాజు అధ్యక్షతన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, వడ్డెమాను శ్రీనివాస్, సిహెచ్.ముసలయ్య, ఎం.బాలకష్ణ, రాష్ట్ర సహాయ కార్యాదార్శులు, అన్నారపు వెంకటేశ్వర్లు, మల్లేష్,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దశరథ, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ అవనగంటి సతీష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కోట్ర నవీన్,పెద్దాపురం శాలీశ్వర్ ,మాదారు, చెరుకు పెద్దులు, తదితరులు పాల్గొన్నారు.