Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని వేదాద్రి ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ మండల పట్టణ జనరల్ బాడీ సమావేశం పెద్ద కందుకూరు సర్పంచ్ భీమగాని రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి అభివద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ని అభివద్ధి చేస్తున్న నేపథ్యంలో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతము విద్యా వైద్య అభివద్ధి పరంగా వెనుకబడి ఉందన్నారు. యాదాద్రి టెంపుల్ అభివద్ధి కోసం పలుమార్లు యాదగిరిగుట్ట కు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి ఈ ప్రాంత అభివద్ధిపైన, విద్య, వైద్యం పైన కేంద్రీకరించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజీలు లేవని తక్షణమే యాదగిరి గుట్ట కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, యాదాద్రి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో యాదాద్రి టెంపుల్ నిర్వాసితుల సమస్యలపైన, ఇండ్ల స్థలాల సాధనకోసం పోరాటాలు కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి,పట్టణ, మండల కమిటీ సభ్యులు ఆర్. నర్సింహ, ఎస్కె. షరీఫ్, జోగు శ్రీనివాస్, సుబ్బు సత్యనారాయణ, గుర్రం కిష్టయ్య, పత్తి నరసింహులు, పత్తి సత్యనారాయణ, దొడ్డి ఉప్పలయ్య, నల్ల మల్లయ్య, ఎర్ర ఐలయ్య, నమిలే నగేష్ తదితరులు పాల్గొన్నారు.