Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు
చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
కందాల రంగారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కషిచేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు కోరారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలో రంగారెడ్డి 37వ వర్థంతిని ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి విగ్రహానికి సీతారాములుతోపాటు రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారాములు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం రంగారెడ్డి అలుపెరగని పోరాటాలు నిర్వహించారన్నారు. కల్లుగీత కార్మికుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టారన్నారు. దున్నేవానికి భూమి దక్కాలని, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు నిర్వహించారన్నారు. నేటి యువత రంగన్నను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా, బూర్గు కష్ణారెడ్డి, మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు దండ అరుణ్‌కుమార్, రాగీరు కిష్టయ్య, బొజ్జ బాలయ్య, చీరిక సంజీవరెడ్డి, తడక మోహన్, ఆకుల ధర్మయ్య, ఎమ్‌డి.ఖయ్యుమ్ పాల్గొన్నారు.
మతాల పేరిట ప్రజలను విభజిస్తున్న బీజేపీ
చౌటుప్పల్‌రూరల్:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి మనువాద విధానాలు అవలంబిస్తూ పాలన సాగిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బొంతల చంద్రారెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి,పంతంగి గ్రామాల్లో కందాల రంగారెడ్డి 37వ వర్థంతిని నిర్వహించారు. రంగన్న స్మారక స్థూపంపై ఉన్న ఎర్రజెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో పెట్రోల్ ధర రూ.100 దాటిందన్నారు. శ్రీలంకలో రూ. 50 మాత్రమే ఉందని తెలిపారు. పెట్రోల్ ,డీజిల్ ధరలను అదుపు చేయాల్సిన కేంద్ర సర్కార్ నిత్యం పెంచుతూ పోతుందన్నారు. దేశంలో ఉన్న సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు మోడీ దోచి పెడుతున్నారని ఆరోపించారు. మతోన్మాద రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల మధ్య ఘర్షణ లేపి రాజకీయ పబ్బం గడుపాలని బీజేపీ ఆలోచిస్తుందని విమర్శించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ఒక్క పైసా పనులు కేటాయించలేదన్నారు.జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేని పాలన కొనసాగిస్తున్నాయన్నారు. బునాది గాని కాల్వ తవ్వి 16 ఏండ్లు గడిచాయని,ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. పేదల పక్షాన పోరాటాలు నిర్వహించిన కందాల రంగన్న ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రొడ్డ అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, ఎండి.పాషా,బండారు నర్సింహ, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, నాయకులు చిరిక సంజీవరెడ్డి, భీమిడి ప్రభాకర్ రెడ్డి, కందాల రవీందర్ రెడ్డి, రాగిరు కిష్టయ్య, పిసాటి నాగరాజురెడ్డి, బొజ్జ బాలయ్య, తడక మోహన్, బోయ యాదయ్య, నందగిరి వసంత, చిరిక అలివేలు, నందగిరి పరమేష్,అంతటి అశోక్,కాకి సుందర్, సామిడి నాగరాజురెడ్డి, కొంతం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.