Authorization
Mon April 14, 2025 04:36:40 pm
నవతెలంగాణ - భువనగిరి
ఈ నెల 21 నుండి 24 వరకు ఒడిస్సాలో జరుగుతున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా చెందిన గోనూరి సింధు ఉమేన్ కేటగిరి డిస్కస్ త్రో విభాగంలో ఎంపికయ్యారు. ఎంపీక కావడం పట్ల శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ భువనగిరి అధ్యక్షుడు చింతల కిష్టయ్య, ఉపాధ్యక్షులు కొలుపులు అమరేందర్, ప్రధాన కార్యదర్శి పాండురంగం, కోశాధికారి గోనూరి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో అసోసియేషన్ సభ్యులు యూసఫ్ ,చింతల శ్రీనివాస్, చింతల శంకర్ ,అంబొజు అనిల్ కుమార్ ,ఐలయ్య, మామిళ్ల కుమార్, సచిన్ సింధు తల్లిదండ్రులు ఉన్నారు