Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్కు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు, గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలీస్ సాంబయ్య మాట్లాడుతూ ఇతర రంగాల కార్మికులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచినా గ్రామపంచాయతీ కార్మికులకు పెంచకపోవడం సరికాదన్నారు. తక్షణమే వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని జీవో నెంబర్ 60 లోని వేతనాలు అమలు చేయాలని జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరం ప్రాతిపదికన కార్మికులను తీసుకోవాలని, పీఎఫ్, ఈఎస్ఐతోపాటు ఇన్సూరెన్స్ అమలు చేయాలని, ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఈద ప్రభాకర్, కొండ్రెడ్డి మంగారెడ్డి, రమేష్, సుధాకర్, శంకరాచారి, నాగరాజు, హుస్సేనమ్మ, సాగర్, మురళి, లక్ష్మమ్మ, సాలమ్మ, పార్వతమ్మ, ముత్తమ్మ, జోజమ్మ పాల్గొన్నారు.