Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గరిడేపల్లి : కేవీకే ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం పొందుతున్న సికింద్రాబాద్ లొయోలా కళాశాల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ విద్యార్థినులు మండలపరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో వరి, ఇతర పంటలలో చీడపీడల యాజమాన్యంపై రైతులకు అవగాహన కలిగించారు. అంతరపంటల సాగు, వ్యాధి లేక పురుగునిరోధక రకాలు, పంటమార్పిడి, ఎర పంటలు చీడపీడల యాజ మాన్యానికి ఉపయోగపడతా యన్నారు. ఒక పంటతో వేరొక పంటను కలిపి అంతర పంటగా వేయడం వల్ల వివిధ పంటలలో గల బాహ్యస్వరూప లేదా జల్లే రసాయనాల తేడా వల్ల అతిధేయ పంటను పురుగులు గుర్తిం చడంలో ఇబ్బందిపడడం వలన పురుగుల సంతతి జీవించడం తగ్గు తుందన్నారు. ఉదాహరణకు మినుముల పంటలో బంతిని అంతరపంటగా వేసినప్పుడు కాయతొలుచు పురుగును నియంత్రిం చొచ్చన్నారు.జన్యుపరంగా వ్యాధి లేదా పురుగు నిరోధకశక్తి గల రకాలను ఎంపిక చేసి సాగుచేయడంతో పురుగులు, తెగుళ్ళ బారి నుండి కలిగే నష్టాలను తగ్గిస్తూ నిరోధిస్తాయన్నారు.ఉదాహరణకు ఐఆర్-20, రత్న రకాలు వరిలో కాండం తొలుచు పురుగును నియంత్రించడానికి ఉపయోగ పడతా యన్నారు.నేలను ఆరోగ్యంగా ఉంచడంలో,సూక్ష్మజీవులు సహజ సిద్ధంగా పనిచేయడంలో పంట మార్పిడి ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు బి.వేణు, బి.శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్, సోమయ్య, విద్యార్థినులు సృజన, శ్రావణి, ఎన్.నిఖిల, సంకీర్తన, రమ్య, సంధ్యారాణి, నిఖిలారెడ్డి, వినీత పాల్గొన్నారు.