Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 27, 28వ తేదీల్లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు
అ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
విద్యాసదస్సును ఉపాధ్యాయులు విజయ వంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి అన్నారు.మంగళవారం యూ టీఎఫ్ కార్యాలయంలో వాల్b ోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో నాగర్ కర్నూల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సామాజిక పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా హాజరు ప్రతినిధులచే విస్తృతంగా చర్చలు జరిపి పలు నిర్ణయాలు, తీర్మానాలు చేసి వాటి కార్యాచరణ కోసం తగిన ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. విద్యా సదస్సులో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ పాల్గొని పలు అంశాలపై ఉపన్యసించనున్నారు. ఈ సమావేశాలకు మొదటిరోజు విద్యా సదస్సు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో నాగర్ కర్నూల్‌కు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు బి.అరుణ, జిల్లా కోశాధికారి నర్ర శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు పి.రాజశేఖర్, నరసింహ, వెంకన్న, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, సీహెచ్.సైదులు, కె.సైదులు, రాజశేఖర్ రెడ్డి, కె.వెంకన్న, శ్రీనివాస్, ఆంజనేయులు, సైదులు పాల్గొన్నారు.