Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
ఉపాధ్యాయులు బోధనలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ కె.అశోక్ తెలిపారు.మంగళవారం మున్సిపల్కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు.రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వ్యయం చేస్తూ అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం ఉపాధ్యాయులు వత్తితో పాటు బోధనలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.మన ఊరు మన బడి కార్యక్రమానికి ఎంపికైన పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలను అభివద్ధి చేసుకోవడానికి సర్పంచులు,ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, ఎస్ఎంసీ చైర్మెన్ సహకారం తీసుకోవాలన్నారు.ఈ సందర్భంగా మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల జిల్లా ఉన్నతపాఠశాలతో పాటు తాటిపాముల, అనంతారం పాఠశాలలను సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంఇఓ శాంతయ్య తిరుమలగిరి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కె.అశోక్‌రెడ్డి, జి.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.