Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 370 సంఘాలకు రూ.25 కోట్ల రుణ వితరణ
నవతెలంగాణ-సూర్యాపేట
మహిళా సంఘాలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి రాయితీలు పొం దాలని ఎస్బీఐ సూర్యాపేట ఆర్ఎం టీ.కష్ణమోహన్ కోరారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని జీవీవీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయకసంఘాలకు రుణ వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.రుణాలు సకాలంలో చెల్లించి మహిళలు రెట్టింపు రుణాన్ని పొంది ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు.బ్యాంకులు అందిస్తున్న బంగారు,ఇంటి,విద్యా రుణాలను తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు.బ్యాంకు నుంచి వివిధ రూపాల్లో అందిస్తున్న రుణాలకు 9శాతం వడ్డీతో పాటు రాయితీలు కల్పిస్తుందన్నారు. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 370 సంఘాలకు రూ.25 కోట్ల రుణాలు అందజేస్తున్నట్టు తెలిపారు.యాదాద్రి భువనగిరి నుంచి 70 సంఘాలకు రూ.5 కోట్లు, సూర్యాపేట డీఆర్డీఏ నుంచి 210 సంఘాలకు రూ.13 కోట్లు,మెప్మా నుంచి 90 సంఘాలకు రూ.7 కోట్ల రుణాలతో మొత్తం రూ.25 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు. ఎస్బీఐ బ్యాంకు బీమా సౌకర్యాలతో పాటు వినియోగదారులకు అనేక రకాల సదుపాయాలను కల్పిస్తున్నదని చెప్పారు. వినియోగదారులు ఈ బ్యాంకు సేవలతో ఆర్థికాభివద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయా సంఘాలకు రుణ వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ సంజీవరావు, డీపీఏం డీఆర్డీఏ రత్తయ్య, ఎస్బీఐ ఏజీఎం కేవీఎల్ఎన్.మూర్తి, మెప్మా ఏవో ఆదిలక్ష్మీ, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు వినోద, వివిధబ్రాంచిల మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.