Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక,ప్రజా వ్యతిరేక బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసనలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు రాయితీలు కల్పించి పేదలసంక్షేమాన్ని విస్మరిం చిందన్నారు.బడ్జెట్లో వ్యవసాయరంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు.వామపక్ష పార్టీల పోరాటఫలితంగా సాధించుకున్న ఉపాధిహామీ చట్టం నిధులు తగ్గించి పేదల ఆకలికి దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్,డీజిల్, గ్యాస్ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు.రైతులకు ఎరువులపై సబ్సిడీ పెంచాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ బ్యాంకులు,కార్పొరేట్ కంపెనీలు కట్టాల్సిన అప్పులను రికవరీ చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయి ంచాలని, అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు.ఐసీడీఎస్ను పరిరక్షిం చాలన్నారు.వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని, ఉపాధిహామీచట్టానికి నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న మండలకేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలలో ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.