Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తుంగతుర్తికి చెందిన 26మంది దళితబంధుకు ఎంపికకాగా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి యూనిట్ల ఎంపిక పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దళితబంధు పథకం లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగుతూ జీవితంలో స్థిరపడాలన్నదే ప్రభుత్వ ప్రధానఉద్దేశమన్నారు.ఎంపికైన లబ్దిదారులతో మాట్లాడుతూ... ఎంపిక చేసుకున్న యూనిట్, ఆయా యూనిట్ల పై వారికున్న అనుభవం, యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన వసతి, సౌకర్యాలు ,మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది.. సంబంధిత యూనిట్ వారికి లాభదాయకమా.. కాదా..? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూనిట్ ఎంపికలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సరైన యూనిట్ ఎంపిక చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, ఎంపీడీఓ ఉపేందర్‌రెడ్డి, ఎంపీఓ భీంసింగ్నాయక్ పాల్గొన్నారు.