Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ :వికలాంగుల యంత్రపరికరాల కోసం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాంగణంలో అలింకో కంపెనీ సహకారంతో వయోవద్ధులకు అసెస్మె ంట్ బుధవారం దరఖాస్తుల స్వీకరణ కోసం శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య మాట్లాడుతూ అలేర్ ప్రాజెక్ట్టు పరిధిలోని వికలాంగులు, వయోవ ద్ధులు ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవాలని కోరారు. ఎంపీపీ గంధమల్ల అశోక్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరి గుట్ట జెడ్పీటీసీ టి. అనురాధ మాట్లాడుతూ అలీఇంకో కంపెనీ ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ చంద్రకళ , ఆలింకో సభ్యులు సునీత, స్వస్తి,దివ్యాప్రకాష్ , యఫ్ అర్ ఓ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.