Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్:టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విస్తత స్థాయి సమావేశాల పోస్టర్ ను బుధవారం స్థానిక టీఎస్‌యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీలలో నాగర్ కర్నూల్లో సంఘం విస్త్రతస్థాయి సమావేశాలు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్రంలో నెలకొన్న విద్య రంగం, సామాజిక పరిణామాలపై విస్త్రతంగా చర్చలు జరిపి పలు నిర్ణయాలు, తీర్మానాలు చేసి కార్యాచరణ కోసం తగిన ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కమిటీ అధ్యక్ష ,కార్యదర్శులు మహమ్మద్ రఫీ, రాగి రాకేష్ కుమార్, గంగాదరి భద్రయ్య ,రాపోలు రఘు, సీనియర్ బాధ్యులు వీర్ల పాటి శ్రీనివాసులు, చింతపల్లి రవీందర్, బొజ్జ వేణుగోపాల్ నల్ల చక్రపాణి ,అల్లం శంకర్, గజ్జి శంకరయ్య, పట్టేటి మల్లేష్, వీర్లపాటి గోపి, యానాల లింగారెడ్డి, కందగట్ల బాలాజీ, కందుకూరి రాములు, చంద్రశేఖర్, ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.