Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
నవతెలంగాణ -నార్కట్పల్లి
మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేయబడిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. మండల పరిధిలోని గోపలాయపల్లి గ్రామంలో బుధవారం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగిన ప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోసుల భద్రాచలం, ఉప సర్పంచ్ యాట సైదులు ,మాజీ ఎంపీటీసీి మచ్చ ముత్యాలు ,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి వార్డు సభ్యులు మచ్చ నరేష్ , గోసుల సుదర్శన,్ గాలి అంజనేయులు, అల్లె కోటేష్ ,కష్ణయ్య ,పరమేష్ ,రాఘవేంద్ర , తదితరులు పాల్గొన్నారు.