Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీసీసీజిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -భూదాన్ పోచంపల్లి
రాబోయే రోజులలో టీఆర్ఎస్కు చరమ గీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పురపాలక కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన తాగునీరు దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజలమధ్య ఉంటూ ప్రజా సమస్యల కోసమే నిరంతరం కషి చేస్తున్నామన్నారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మండలం ఒకవైపు మూసీ ప్రాంతం మరొకవైపు పరిశ్రమల రసాయన కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నదన్నారు. పరిస్థితి ప్రజలు తాగడానికి నీరు లేక కాలుష్యం ఫ్లోరోసిస్ నీరు తాగి రోగాల బారిన పడుతున్నారన్నారు. మున్సిపాలిటీలో ఇప్పటివరకు కష్ణా గోదావరి జలాలు ఏ ఒక్క ఇంటికి అందించలేదన్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమండల అధ్యక్షులు పాక మల్లేశం ,తడక వెంకటేశం, సామ మధుసూదన్ రెడ్డి , నర్సింహారెడ్డి,భారత లవ కుమార్ ,సూర్ పల్లి రమేష్ ,వెంకటేశం రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.