Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐదేండ్లు అయినా అమలుకు నోచని హామీ
అ నేడు సేవాలాల్ జయంతి వేడుకలకు మంత్రి రాక
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
సంత్సేవాలాల్స్మారక భవనం నిర్మిస్తామని హామీనిచ్చి ఐదేండ్లు గడిచినా ఇంతవరకు నిర్మించలేదు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా అన్ని కులాల, మతాల, వర్గాలకు చెందిన పోరాట యోధులను గౌరవించుకునేదుకు రాష్ట్ర ముఖ్య మంత్రి చేపట్టిన కార్యక్రమాల్లో గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఒకటి. సేవాలాల్ జయంతి వేడుకలు జరుపుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం మునుగోడు నియోజక వర్గానికి వివక్ష చూపిస్తున్నదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజన(లంబాడీ)జనాభ ఉన్న నారాయణపురం మండల కేంద్రంలో నియోజక వర్గ గిరిజనుల సౌకర్యార్థం సంత్ సేవాలాలు మహారాజు జ్ఞాపకార్ధగా ఐదుఎకరాల ప్రభుత్వ భూమిని సేకరంచి, మందిర నిర్మాణంతో పాటు వసతి గహం నిర్మిస్తామని హామీనిచ్చారు. హామీనిచ్చి ఐదేండ్లు కావస్తున్నా అమలుకు నోచుకోవడం లేదని పలువురు గిరిజనులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. హామీలు ఇచ్చిన నాయకులు అధికారులకు ఆదేశాలు జారీ చేయనందున హమీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసి వచ్చే జయంతి వేడుకల వరకు సేవాలాలు మందిరం, వసతి గహం నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు.
గిరిజనులు అంటే ఎందుకు నిర్లక్ష్యం
కరంటోతు బిక్షపతి నయక్
(గిరిజన నాయకుడు)
గిరిజనులపట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటే తప్ప సేవాలాల్ భవనం పూర్త్తి కానీ పరిస్థితి ఉంది .
మంత్రి పక్కా హమీ ఇవ్వాలి
కాత్రోత్ సాగర్ నాయక్(రాచకొండ మాజీ సర్పంచ్)
సేవాలాల్ మందిరం, భవన నిర్మాణ పనుల విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డ్డి పక్కాగా హామీ ఇవ్వాలి. ఇప్పటికీ చాలా ఆలస్యమైయింది. స్ధానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించే పరిస్థితిలో లేరు.