Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మునుగోడు
సోలిపురం ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేడని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పెండెం ధనుంజరు నేత అన్నారు. బుధవారం మండలంలోని సోలిపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి నాలుగు వైపుల వరదలు ముంచెత్తి ఒక ద్వీపాన్ని తలపిస్తుందన్నారు. కొద్దిపాటి వర్షపాతం నమోదైన వరదల కారణంగా ఇల్లలో నుంచి బయటికి రాని పరిస్తితి తో వైద్యం చేపించుకొలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయకపోవడం దారుణమన్నారు త్వరలో గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని బ్రిడ్జి రోడ్డు నిర్మాణం పూర్తయ్యేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి బొట్టు శివ, కన్వీనర్ పి.హరీశ్, బీఎస్పీ నాయకులు సురేష్, రవితేజ , లింగ స్వామి , శ్రావణ్, అనిల్, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు