Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టాలీవుడ్ నటి సమంత
అ మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభించడం
ఎంతో శుభప్రదం
అ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
అ అభిమానుల పై పోలీసులు లాఠీచార్జి
నవతెలంగాణ-నల్లగొండ
అనతి కాలంలోనే నాణ్యమైన మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా మాంగళ్యం షాపింగ్ మాల్ నిలిచిందని టాలీవుడ్ నటి సమంత అన్నారు. అతిపెద్ద వస్త్ర సామ్రాజ్యాలలో ఒకటైన మాంగళ్య షాపింగ్ మాల్ బుధవారం నల్గొండ పట్టణంలో 12వ షాపింగ్‌మాల్‌ను నటి సమంత ,విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా నటి సమంత మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్ మాల్ అనతికాలంలోనే నాణ్యమైన, మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి గడిచిందన్నారు. కస్టమర్ల అభిరుచులకనుగుణంగా అత్యాధునిక అందుబాటులో ఉంచి వారి మనసులను గెలుచుకుందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభించడం ఎంతో శుభకరమన్నారు.18 వేల చదరపు అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో అతిపెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ ప్రారంభించడం ఒక కీలక పరిణామమన్నారు. గతంలో నల్గొండ వాసులంతా శుభకార్యాలకు షాపింగ్ ల కోసం హైదరాబాద్ లేదా విజయవాడకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. అయితే నల్లగొండలోని మాంగళ్య షాపింగ్ మాల్ రావడంతో కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా కావాల్సినన్ని ఒకేచోట దొరుకుతున్నాయన్నారు. షాపింగ్ మాల్ చైర్మెన్ పీవీఎన్ మూర్తి మాట్లాడుతూ పిల్లల కోసం విస్త్రతమైన దుస్తుల శ్రేణి డిజైన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ గ్రూపునకు ఇది 12వ షోరూమ్ కాగా, 18000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో, 4 అంతస్తులలో విస్తరించి ఉన్న ఈ షోరూమ్‌లో ప్రతి ఒక్కరీఅభిరుచికి అనుగుణంగా వారికి ఇష్టమైన కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళల కోసం అనేక వెరైటీల చీరలు, లెహంగాలు, వెస్ట్రన్ వేర్, వెడ్డింగ్ వేర్, డ్రెస్ మెటీరియల్స్ , మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. పురుషుల కోసం ట్రెండీ ధోతీలు, కుర్తీలు, షర్టులు, టీషర్టులు, ప్యాంట్లు, జీన్స్, వివాహ దుస్తులు, పండుగ దుస్తులు మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కస్టమర్ల భద్రత కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు కాసం నమశ్శివాయ, శివప్రసాద్ ,అరుణ్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అభిమానులపై పోలీసులు లాఠీచార్జి
నల్లగొండలో మాంగళ్యం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి సమంత వస్తుందన్న వార్త తెలుసుకున్న అభిమానులు ప్రజలు సమంతను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిక్కిరిసిన అభిమానుల సందడిని ముందే ఊహించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానుల కేరింతల మధ్య షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన సమంత మాల్‌ను కలియ తిరిగి అనంతరం మాల్ బయటకు వచ్చి తన కోసం ఎదురు చూస్తున్నఅభిమానులకు చేతులు ఊపి అభివాదం చేశారు. ఈ సమయంలో అభిమానులు ఒకేసారి ఆమె ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.