Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను సవరించాలని కోరుతూ సీఐటీయూ, వ్యవకాస, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 25న తలపెట్టిన దేశవ్యాప్త నిరసన దినాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ నర్సింహులు విజ్ఞప్తి చేశారు. బుధవారం మూడు సంఘాల ముఖ్యుల సమావేశం స్థానిక సుందరయ్య భవనలో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుత్త పెట్టుబడిదారులకు లాభంచేకూర్చేవిధంగా, పేదలకు, వివిధ వర్గాలకు వ్యతిరేక బడ్జెట్ తీసుకొచ్చి ప్రజా సంపదను లూటీ చేస్తుందన్నారు. ఉపాధి హామీ కార్మికులకు, రైతాంగానికి నష్టం చేసే విధంగా ఉన్న కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.