Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
రాచకొండ గిరిజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ జిల్లాల పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, పగడాల యాదయ్యలు మాట్లాడారు. రాచకొండ పరిధిలోని సర్వేనెంబర్ 273 భూముల్లో 70 సంవత్సరాల నుండి హరిజనులు, గిరిజనులు, బీసీలు సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. 20 సంవత్సరాల క్రితం వీరికి ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో గతంలో ఇచ్చిన పట్టా పాసుపుస్తకాలకు బదులు నూతన పట్టా పాసుపుస్తకాలు ఇవ్వడం లేదన్నారు. పేద ప్రజలు సాగుచేసుకుంటున్న అట్టి భూముల్లో ఫారెస్టు అధికారులు గుంతలు తీసి మొక్కలు నాటుతున్నారన్నారు. దీంతో పేద రైతులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుందన్నారు. భూముల వద్దకు పేద ప్రజలు వస్తే వారి పిల్లలపై రౌడిషీట్ కేసు పెట్టిస్తామని, మీ రేషన్ కార్డు తీసివేయిస్తామని బెదిరిస్తున్నారని రెవెన్యూ అధికారులకు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగుచేసుకుంటున్న పేద రైతులకు నూతన పట్టా పాసుపుస్తకాలు ఇప్పించి, ఫారెస్టు అధికారుల దౌర్జన్యాలు ఆపాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ సూరజ్కుమార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాసచారి, బండారు నర్సింహా, శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్, మంచాల మండలకార్యదర్శులు గంగదేవి సైదులు, శ్యామ్‌సుందర్, ఉప్పలపల్లి బాలకష్ణ, పేద రైతులు పాల్గొన్నారు.