Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయంలో దళితబంధు పథకానికి లబ్దిదారుల దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు. లబ్దిదారులకు యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన వసతి సౌకర్యాలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. యూనిటీ ఎంపికలో తొందరపడకుండా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉపేందర్‌రెడ్డి, ఎంపీఓ భీమ్సింగ్నాయక్, లబ్దిదారులు పాల్గొన్నారు.