Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు.బుధవారం మండల ంలోని యరగండ్లపల్లి,కొండూరు, లెంకలపల్లి గ్రామాలలో నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధపోరాటస్ఫూర్తితో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) కట్టుబడి పని చేస్తుందన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచకుండా కాలయాపన చేస్తూ పదవులను కాపాడు కోవడమే సమయం సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని, రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య,ఉప్పునూతల వెంకటయ్య,ఏర్పుల దుర్గమ్మ,సొప్పరి హనుమంతు,మైల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు