Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన
అ పోలీస్సేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు
అ 8 మందిపై కేసు నమోదు
నవతెలంగాణ-కోదాడరూరల్
వ్యక్తి బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ చూపించి ఎకరం రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేయగా ఎనిమిది మందిపై కేసు నమోదైన సంఘటన మండలపరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.టౌన్ ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు బతికి ఉండగానే ఫౌతి పేరుతో అతని భూమిని మరొకరికి ధారదత్తం చేశారు. మండలంంలోని నల్లబండగూడెంకు చెందిన గుంజ చిన్నగుర్వయ్య తండ్రి వెంకటేశ్వర్లుకు తన తండ్రి ద్వారా ఎకరం భూమి వారసత్వంగా వచ్చింది. గ్రామ రెవెన్యూ పరిధిలోని ఉన్న సర్వే నం. 485/అ/1/2/1లో ఎకరం భూమికి కొత్త పట్టాదారు పాస్బుక్ సహితం వచ్చింది.తన తండ్రి కాలం నుండి భూమిపై హక్కు కలిగి ఉన్నాడు. ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ధరణి పోర్టల్లో ఫౌతి ద్వారా పెట్టుకునే అప్లికేషన్ చాలావరకు అప్రూవ్డ్ చేయాల్సి ఉంటుంది.దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి ధరణి పోర్టల్లో చిన్న గుర్వయ్య పేరున ఎకరం భూమి ఉండడాన్ని గమనించి తన తండ్రి పేరు కూడా అదేకావడంతో డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఆధార్ అవసరం కావడంతో బాధితుడు అయిన చిన్నగుర్వయ్యకు వడ్డెర సంఘంలో సభ్యత్వం కోసమని మాయమాటలు చెప్పి అతని ఆధార్ కార్డ్ తీసుకొని ధరణి పోర్టల్లో ఫౌతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.రెవెన్యూ అధికారులు గుడ్డిగా బాధితుడు పేరున ఉన్న భూమిని మరొకరికి ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో బాధిత రైతు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు.అనంతరం విషయాన్ని తహసీల్దార్ శ్రీనివాసశర్మ దృష్టికి తీసుకెళ్లాడు.తప్పులను గుర్తించి అధికారులు గ్రామంలో పెద్దమనుషుల మధ్య తేల్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చి తప్పుకున్నారు.గ్రామంలోని పెద్దమనుషుల వద్ద తేలకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే కోర్టుకు వెళ్ళమని సూచించారు.ఎకరం పొలమే జీవనాధారంగా బతుకుతున్న పేద కుటుంబం రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకు తాము కోర్టుల చుట్టూ తిరిగి అప్పులపాలు కావాల్సి వస్తోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని లేకపోతే మరణం తప్ప మరోమార్గం లేదని కన్నీరు పెట్టుకున్నాడు.