Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎంపీపీ పీఠం కైవసం
నవతెలంగాణ-చివ్వెంల
ప్రజల కష్టాలు ఆమెను ఎంతగానో కదిలించాయి.రాజకీయంగా భర్త పడుతున్న కష్టాన్ని చూసినప్పుడల్లా రాజకీయాల్లో నిలదొక్కుకుని ప్రజాసేవ చేయాలన్న పట్టుదల ఆమెను ప్రేరేపించాయి.ఆత్మవిశ్వాసంతో కష్టపడి ప్రజా సమస్యలు తెలుసుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎంపీటీసీగా విజయం సాధించారు.కానీ అక్కడితో ఆగలేదు. ఎంపీపీ పీఠం ఎస్టీ మహిళా రిజర్వేషన్ కావడంతో టీఆర్ఎస్ నుంచి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆశీస్సులతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఒకప్పుడు గృహిణి నేడు ఎంపీపీగా రాణిస్తున్న ధరావత్ కుమారిబాబునాయక్తో 'నవతెలంగాణ'తో బుధవారం మాట్లాడారు.ఆమె మాటల్లోనే మారుమూల గిరిజనతండా పాచ్యానాయక్తండాలో సాధారణ కుటుంబం.భర్త ధరావత్బాబునాయక్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ రాజకీయాలపై ఆసక్తితో టీడీపీ నుండి ఎంపీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.ప్రజలకు సేవచేసే అదృష్టం దక్కడంతో తండాలలోని ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో ముందకు నడిపారు.తొలివిజయం ధైర్యాన్ని పెంచిందని తెలిపారు. ప్రతిరోజు మహిళా ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ తండాలను అభివృద్ధి చేసుకునే అదృష్టం తండా ప్రజలు ఇవ్వడం జీవితంలో మర్చిపోలేనిది.2019 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీగా బరిలో నిలిచి విజయం సాధించి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆశీస్సులతో ఎంపీపీ పీఠాన్ని అధిరోహించడం మర్చిపోలేనిదన్నారు. తన విజయం వెనుక తన కుటుంబసభ్యుల సహకారం భర్త తోడ్పాటుతోనే రాజకీయంగా నిలదొక్కుకొని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నామని తెలిపారు.
జిల్లాలో మండలాన్ని
ఆదర్శంగా నిలుపుతాం..ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్‌రెడ్డి సహకారంతో మండలంలోని గ్రామగ్రామాన రూ.లక్షలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందుమండలానికి అత్యధిక నిధులు సమకూర్చుకొని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాలోనే మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతాం.