Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్గులపల్లి :బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోరెడ్డిగూడెం సర్పంచ్ పోరెడ్డి కోటిరెడ్డి, పాములపాడు ఎంపీటీసీ యాతం కళింగరెడ్డి కోరారు.బుధవారం మండలంలోని పోరెడ్డిగూడెంలో ఉపాధినిధులు రూ.10 లక్షల వ్య యంతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణపనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సలహాదారు పోకల రాజు, ఉప సర్పంచ్ సంకలమద్ది లక్ష్మమ్మ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గవ్వ నర్సిరెడ్డి, కొండ జానకమ్మ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పోరెడ్డి అప్పారెడ్డి, నాయకులు పోరెడ్డి వెంకట్రెడ్డి, గోగు మల్లారెడ్డి, వెన్న వెంకట్రెడ్డి, ఊట్కూరిమల్లారెడ్డి, లింగారెడ్డి, సత్తిరెడ్డి, కొండ నాగమ్మ, బాబురెడ్డి పాల్గొన్నారు.