Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సందర్శకులు కోవిడ్ నిబంధనలు పాటించాలి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని అశోక్‌నగర్‌లో బుధవారం నుమాయిష్ (ఎగ్జిబిషన్) అట్టహాసంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్‌తో కలిసి శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు నుమాయిష్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడారు.కరోనా థర్డ్‌వేవ్ దృష్ట్యా పొంచివున్న ముప్పు తగ్గడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఎగ్జిబిషన్ ప్రారంభానికి మార్గం సుగమమైంది. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య వస్తు ప్రదర్శన చేపట్టేందుకు నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.పిల్లలకు,పెద్దలకు వినో దాన్ని, అహ్లాదాన్ని పంచే ఎగ్జిబిషన్‌కు హాజరయ్యే సందర్శకులు కచ్ఛితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులు మాస్కులు ధరించాలని అభ్యర్ధి ంచారు. నుమాయిష్ ప్రవేశ ద్వారం వద్ద డిజిటల్ థర్మామీటర్ ఏర్పాటు చేసి లోపలికి వచ్చేవారిని పరీక్షి ంచాలని, అన్ని స్టాళ్ల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు ఇలియాస్,సలీం, నాయకులు ఉదరు భాస్కర్, పత్తిపాటి నవాబ్, సత్యం, సైదిరెడ్డి ఎగ్జిబిషన్ నిర్వాహకులు నూర్ అహ్మద్ ఉన్నారు.