Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సూర్యాపేట
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సర్దార్ సతీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని 5వ వార్డు కౌన్సిలర్ షేక్ బాషా ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. గురువారం వార్డులోని సతీష్ నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో కొడుకు మరణిచడం తల్లిదండ్రులకు తీరనిలోటన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి దష్టికి తీసుకెళ్ళి సహకారం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డా. దుర్గం ప్రభాకర్,టిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్కూరి వెంకట్ రెడ్డి,5వ వార్డు టీిఆర్ఎస్ అధ్యక్షులు ధరావత్ శివరాం,చెన్నోజు ఉపేంద్ర చారి, సైదిరెడ్డి, తదితరులు ఉన్నారు.