Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మన ఊరు మనబడి కార్యక్రమం విద్యారంగంలో పెను మార్పులు జరుగుతాయని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు అన్నారు .గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మన ఊరు -మన బడి అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేయబడ్డ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను సమీకరించి మౌలిక వసతులు సమకూర్చుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేసే విధంగా కృషి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల పేద పిల్లలకు న్యాయం జరుగుతుందన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన 317 జీవో ద్వారా స్థానికత విషయంలో వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి చింత రెడ్డి రామలింగారెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారం వెంకన్న, జిల్లా మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ,కపాకర్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు ఎర్ర హరికృష్ణ, ఉపాధ్యాయులు భాస్కర్, చంద్రశేఖర్, కైరం కొండ రమేష్ పాల్గొన్నారు.