Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ న్యాయమూర్తులు ఎ.అర్జున్, కలిదిండి తులసి దుర్గారాణి
నవతెలంగాణ- రామన్నపేట
వత్తిపట్ల నిబద్దతతో ఉండి ఉత్తమ, ఆదర్శ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం బాధాకరమని జూనియర్ సివిల్ జడ్జి ఎం.అర్జున్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కలిదిండి తులసి దుర్గారాణి అన్నారు. గురువారం స్థానిక కోర్టు ఆవరణలో శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సీిఐ చింత మోతి రామ్, సీనియర్ న్యాయ వాదులు యాపాల కష్ణారెడ్డి, పి.అశోక్ కుమార్, వి.హనుమంతు గౌడ్, శోభన్ బాబు, బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నకిరేకంటి మొగులయ్య, బర్ల డేవిడ్, ఎస్ బాలరాజు, యాదాసు యాదయ్య, నోముల స్వామి, ఎంఏ.మజీద్, మామిడి వెంకట్ రెడ్డి, గాలి లింగయ్య, సుక్క శ్రవణ్, దినేష్, బోడిగే లక్సయ్య, పాల్వంచ జాగత్తయ్య ఉన్నారు.